epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఢిల్లీలో ఎయిర్​ ఎమర్జెన్సీ

కలం, వెబ్​ డెస్క్​ : ఢిల్లీ(Delhi)లో గాలి నాణ్యత రోజురోజుకు దిగజారిపోతోంది. ఈ రోజు సాయంత్రం నగరంలోని అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి (AQI) 400 మార్కును దాటింది. దీంతో సెంట్రల్​ పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు (CPCB) అధికారులు కాలుష్య నియంత్రణ చర్యలను అమలు చేశారు. గ్రేడెడ్​ యాక్షన్​ రెస్పాన్స్​ ప్లాన్​ (GRAP)  లోని స్టేజ్ -IV నిబంధనలను శనివారం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. సాయంత్రం 4 గంటలకు 431గా ఉన్న AQI సాయంత్రం 6 గంటలకు 441కు చేరింది.

దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారి కాలుష్య స్థాయులు Severe+ దాటే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అయితే, గ్రేడెడ్​ రెస్పాన్స్​ యాక్షన్​ ప్లాన్​ లోని స్టేజ్​ III నిబంధనలు అమలులోకి వచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే పరిస్థితి మరింత క్షీణించింది. ఈ క్రమంలోనే వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కమిషన్ఫర్ఎయిర్క్వాలిటీ మేనేజ్మెంట్​ ఢిల్లీ(Delhi)లో ఎయిర్ఎమర్జెన్సీ (Air Emergency) ని ప్రకటించింది. ఈ నిర్ణయంతో కాలుష్య స్థాయి పెరగకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Read Also: మెస్సీ పక్కన రాహుల్, రేవంత్ ప్లేస్ డిసైడ్ చేసేదెవరు?

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>