కలం, వెబ్ డెస్క్ : పోలాండ్‌లోని ఒక పబ్లిక్ పార్కులో అత్యంత అరుదైన, భీకరమైన దృశ్యం వెలుగుచూసింది. పార్కులో పిల్లలు సరదాగా ఆడుకుంటున్న సమయంలో, అక్కడి ఫౌంటెన్‌పై ఒక్కసారిగా పిడుగు (Lightning Strikes) పడింది. ఎగిసిపడుతున్న నీటి ధారలను మెరుపు తాకిన ఈ భయానక దృశ్యం అక్కడ ఉన్న సర్వైలెన్స్ కెమెరాలో రికార్డైంది. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రకృతి సృష్టించిన ఈ అద్భుత, ప్రమాదకరమైన విజువల్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

