అదానీ గ్రూప్ సంస్థల్లో ఎల్‌ఐసీ(LIC) పెట్టుబడులు పెట్టడం తీవ్ర దుమారం రేపింది. అయితే పెట్టుబడుల విషయం తమ స్వతంత్ర నిర్ణయమని, అందులో ఎవరి ఒత్తిడి, జోక్యం లేదని ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ తాజాగా స్పష్టతనిచ్చింది. ఈ పెట్టుబడులపై వాషింగ్‌టన్ పోస్ట్(Washington Post) కొన్ని కీలక ఆరోపణలు చేసింది. దీని వెనక బీజేపీ ప్రభుత్వ హస్తం ఉందని, కేంద్రం ఒత్తిడితోనే ఎల్‌ఐసీ పెట్టుబడులు పెట్టిందని వాషింగ్‌టన్ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఎల్‌ఐసీ స్పందించింది. అది తమమంతట తాముగా తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేసింది.
2025 మొదట్లో అదానీ గ్రూప్(Adani Group) సంస్థల్లో ఎల్‌ఐసీ భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టిందని వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది. ఇది ప్రభుత్వ ప్రణాళిక మేరకే జరిగిందని ఆరోపించింది. ఈ అంశం రోజురోజుకు తీవ్రతరం అవుతుండటంతో ఎల్‌ఐసీ వివరణ ఇచ్చింది. తమ పెట్టుబడుల విషయంలో ఆర్థిక మంత్రిత్వశాఖ, ఇతర శాఖల ప్రమేయం ఏమీ లేదని తేల్చి చెప్పింది ఎల్‌ఐసీ. వాటాదారుల ప్రయోజనాలకు అనుగుణంగా అత్యుత్తమ ప్రమాణాలు ఎల్‌ఐసీ(LIC) పాటిస్తూ వస్తోందని, అలాంటి సంస్థపై బురద చల్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికింది.
Read Also: అలా చేస్తేనే కాంగ్రెస్‌కు బుద్ది వస్తుంది: కేటీఆర్

