epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

డీసీపీపై దాడి.. పోలీసు కాల్పుల్లో ఇద్దరికి గాయాలు..

హైదరాబాద్ చాదర్‌గాట్‌లో డీసీపీ సాయి చైతన్య(DCP Chaitanya)పై కత్తితో జరిగిన హత్యాయత్నం తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ అంశంపై సీపీ సజ్జనార్(CP Sajjanar) ఫోకస్ పెట్టారు. ఘటనా స్థలిని ఆయన పరిశీలించారు. తనపై దాడిచేసిన దుండగులపై డీసీపీ చైతన్య కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఇద్దరు దొంగలకు గాయాలయ్యాయని సజ్జనార్ తెలిపారు. కాగా, పోలీసులకు ఒక దొంగ చిక్కాడని, అతడి పేరు ఒమర్‌ అని వెల్లడించారు. ఒమర్‌పై 25 కేసులతో పాటు రౌడీ షీట్ కూడా ఉందని చెప్పారు సజ్జనార్.

శనివారం సాయంత్రం సీపీ ఆఫీసులో మీటింగ్‌కు అటెండ్ అయిన డీసీపీ సాయిచైతన్య.. సమావేశం ముగించుకుని వస్తున్న క్రమంలో సెల్‌ఫోన్ చోరీ చేసి పారిపోతున్న ఇద్దరి దొంగలను చూశారు. వెంటనే వారిని పట్టుకోవడం కోసం డీసీపీ, అతని గన్‌మ్యాన్ ప్రయత్నించారు. ఈ క్రమంలో దొంగల్లో ఒకరు డీసీపీ, గన్‌మ్యాన్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనపై గన్‌మ్యాన్‌కు గాయాలు కాగా.. డీసీపీ చైతన్య(DCP Chaitanya) కిందపడ్డారు. వెంటనే తేరుకున్న చైతన్య.. దొంగలపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. గాయపడి దొరికిన దొంగకు నాంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Read Also: అదానీ గ్రూప్‌లో పెట్టబడులపై LIC క్లారిటీ..

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>