Mobile Popup Ad
Mobile Popup Ad

దుబ్బాకలో చిరుత సంచారం.. ఆందోళనలో స్థానికులు

కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట జిల్లా దుబ్బాక (Dubbaka) మండలం హబ్సిపూర్ గ్రామంలో చిరుత పులి సంచారం (Leopard sighted) తీవ్ర కలకలం రేపుతోంది. మెదక్ – సిద్దిపేట ప్రధాన రహదారిని చిరుత దాటుతుండగా స్థానికులు గుర్తించారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. హైవేపై చిరుతను గమనించిన పలువురు వాహనదారులు, స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు పలు ప్రాంతాల్లో చిరుత పాదముద్రలను గుర్తించి, అది సంచరిస్తున్న విషయాన్ని ధ్రువీకరించారు. పరిసర ప్రాంతాల ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>