Mobile Popup Ad
Mobile Popup Ad

గుడివాడలో ఘోర మోసం.. వెంకటేశ్వర స్వామి బంగారు కిరీటం తాకట్టు

కలం, వెబ్ డెస్క్ : గుడివాడలో(Gudivada) ఘోరమైన మోసం వెలుగులోకి వచ్చింది. వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన కోటి రూపాయల విలువైన బంగారు కిరీటం(Golden Crown) మాయం చేసి, దాన్ని కేవలం రూ.38 లక్షలకు తాకట్టు పెట్టిన ఘటన కలకలం రేపింది. 2025 జనవరిలో వృద్ధ దంపతులు భక్తితో ఆలయానికి ఈ బంగారు కిరీటాన్ని దానం చేశారు. అయితే ఆలయ ట్రస్ట్ నిర్వహణలో ఉన్న వ్యక్తులు ఆ కిరీటాన్ని అక్రమంగా తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై ఆలయ ప్రెసిడెంట్ మోహనరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాతల ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు. దేవాదాయ శాఖ అధికారులు కూడా రంగంలోకి దిగి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. తాకట్టు పెట్టిన వ్యక్తి రాజస్థాన్‌లో ఉన్నట్లు గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ ఘటన భక్తులలో తీవ్ర ఆగ్రహం, ఆందోళనకు కారణమైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>