కలం, వెబ్ డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతిలో చిరుతలు కలకలం రేపుతున్నాయి. తరచుగా మెట్ల మార్గంలో సంచరిస్తూ భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. టీటీడీ (TTD) అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. చిరుతలు సంచరిస్తున్నాయి. మరోసారి తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత (Leopard) కలకలం రేపింది. 400వ మెట్టు వద్ద భక్తులు చిరుత సంచారాన్ని గుర్తించారు. దీంతో టీటీడీ సిబ్బంది అప్రమత్తమై భక్తులను కాసేపు నిలిపివేశారు. చిరుత కోసం గాలించినా జాడ దొరకలేదు. ఆ తర్వాత భక్తులను అనుమతించారు. భక్తులు గుంపులుగుంపులుగా వెళ్లాలని సూచించారు.
కాగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్ని నిండిపోయి నారాయణగిరి ఉద్యానవనం వరకు భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.


