కలం వెబ్ డెస్క్ : దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరుగుతోంది. తీవ్రమైన పొగమంచు(Dense Fog)తోె ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పొగమంచు ప్రభావంతో శుక్రవారం ఉదయం హైదరాబాద్(Hyderabad)లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్(Shamshabad Airport)లో రెండు విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి వారణాసి వెళ్లాల్సిన ఇండిగో(Indigo), స్పైస్‌జెట్(SpiceJet) విమానాలు రద్దయినట్లు అధికారులు వెల్లడించారు. ముందుగా ఈ రెండు విమానాలు శంషాబాద్ నుంచి బయలుదేరాయి. అయితే, వారణాసిలో పొగ మంచు ఎక్కువగా ఉండడంతో విమానాలను తిరిగి శంషాబాద్‌కే మళ్లించారు. వాతావరణం అనుకూలంగా మారిన వెంటనే సర్వీసులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ప్రయాణికులు సమస్యను గుర్తించి సహకరించాలని కోరారు.


