లెఫ్ట్ ప్రభుత్వం లేని ఇండియా.. 50 ఏండ్లలో ఫస్ట్ టైమ్!

కలం, వెబ్‌డెస్క్: భారత రాజకీయాల్లో కమ్యూనిస్టు పార్టీ (Left Parties) అధికారంలో లేకుండా పోవడం గడచిన యాభై ఏండ్లలో ఇదే తొలిసారి. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ అమలైన తర్వాత కమ్యూనిస్టుల ప్రాబల్యం కొన్ని రాష్ట్రాల్లో పెరిగింది. ప్రజాస్వామిక హక్కుల గురించి కమ్యూనిస్టు పార్టీలు గొంతెత్తుతాయన్న అభిప్రాయంతో 1977లో తొలిసారి పశ్చిమబెంగాల్‌లో సీపీఎం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది. 2011 వరకు ఆ పార్టీ అధికారంలో కొనసాగింది. గిన్నిస్ రికార్డు నమోదైంది. ఆ రాష్ట్రంలో 1977-2011 వరకు సీపీఎం వరుసగా 34 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగింది.

అదే సమయంలో ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో 1993 నుంచి 2018 వరకు సీపీఎం (CPI-M) పాతికేళ్ల పాటు పవర్‌లో ఉన్నది. దక్షిణాదిన కేరళంలో ప్రతీ ఐదేండ్లకు ఒకసారి సీపీఎం అధికారంలోకి రావడం సంప్రదాయం. కానీ 2016 నుంచి 2026 వరకు సీపీఎం రెండుసార్లు అధికారంలో కొనసాగింది. ఆ రికార్డు పినరయి విజయన్‌కు దక్కింది. పశ్చిమబెంగాల్, త్రిపురలో సీపీఎం ఓడిపోయిన తర్వాత కేరళంలో పవర్‌లో ఉండడంతో కనీసం ఒక్క రాష్ట్రంలోనైనా ఉన్నదనే రికార్డు కొనసాగింది. తాజాగా పినరయి ఓటమితో దేశంలో ఒక్క చోట కూడా సీపీఎం (Left Parties) ప్రభుత్వం లేకపోవడం గడచిన 50 ఏండ్లలో ఇదే ఫస్ట్ టైమ్.

Read Also: కేర‌ళ‌లో హామీలు నెర‌వేర్చేందుకు క‌ష్ట‌ప‌డ‌తాం: ప్రియాంకా గాంధీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>