వారసత్వ రాజకీయాలకు ముగింపు ప‌లికిన త‌మిళ ఓట‌ర్లు

క‌లం, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamil Nadu) లో వారసత్వ రాజకీయాలను తమిళ ఓటర్లు (Tamil Voters) తిరస్కరించారు. పార్టీలు ఎప్పుడూ ఒక కుటుంబం చేతిలోనే ఉండాలనే కల్చర్‌ను వ్యతిరేకించారు. కరుణానిధి, స్టాలిన్, ఉదయనిధి.. తరాలు మారినా వారి కంట్రోల్‌లోనే పార్టీలు అనే విధానానికి స్వస్తి పలికారు. డీఎంకే భారీగా నష్టపోయింది. అధికారం నుంచి థర్డ్ ప్లేస్‌లోకి పడిపోయింది. డీఎంకేకు ఆల్టర్నేట్‌ అన్నాడీఎంకే అని ప్రజలు భావించలేదు. డీఎంకే పట్ల ప్రజల్లోని వ్యతిరేకత విజయ్‌కు అడ్వాంటేజ్‌గా మారింది. ఆ ఆగ్రహమే విజయ్‌ను ఆల్టర్నేట్ లీడర్‌గా ఎన్నుకున్నారు. అన్నాడీఎంకే నాయకత్వంలో వారసత్వం లేదని ఓటర్లు భావించారు. అందుకే ఆ పార్టీ తన బలాన్ని పెద్దగా కోల్పోలేదు. తన స్థానాన్ని పదిలంగా కాపాడుకుని సెకండ్ ప్లేస్‌లో నిలబడింది.

డౌన్‌ఫాల్‌లో ద్రవిడ పార్టీలు :

దాదాపు ఆరు దశాబ్దాల పాటు రెండు ద్రవిడ పార్టీలే అధికారంలో కొనసాగాయి. డీఎంకే వర్సెస్ అన్నాడీఎంకే అనే తీరులోనే రాజకీయాలు నడిచాయి. ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలనే ట్రెండ్ నడిచింది. కానీ నేటి తరం ద్రవిడ పార్టీల డామినేషన్‌ను జీర్ణించుకోలేకపోయింది. కొత్త రక్తం వస్తేనే పరిపాలనలో కొత్తదనం ఉంటుందని నమ్మారు. స్టీరియోటైప్ విధానాలకు ఆల్టర్నేట్‌ రావాలని కోరుకున్నారు. అప్పట్లో ఎంజీఆర్ ఆ తరహా ఆలోచనతో పాపులర్ లీడర్‌గా ఎదిగారు. కొత్తగా పార్టీ పెట్టి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత కొత్త పార్టీతో పవర్‌లోకి వస్తున్న వ్యక్తిగా విజయ్ రికార్డు సృష్టించారు. ఎంజీఆర్ ఎంట్రీతో మూడు టర్ములు డీఎంకే సీన్‌లో లేకుండాపోయింది. ఇప్పుడు విజయ్ ఎంట్రీతో అదే రిపీట్ అవుతుందా?.. లేక పాలపొంగు మాత్రమేననేది ఎస్టాబ్లిష్ అవుతుందా?

ద్రవిడ పాలిటిక్స్‌కు ఆల్టర్నేట్‌గా విజయ్ :

తమిళనాడు 1960వ దశకం చివర్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైన తర్వాత ద్రవిడ పార్టీలు బలపడ్డాయి. ద్రవిడ మున్నేర కజగం (డీఎంకే) పార్టీతో ద్రవిడ పాలిటిక్స్ మొదలయ్యాయి. అన్నాదురై మరణం తర్వాత డీఎంకేలో కరుణానిధితో ఎంజీఆర్‌కు విభేదాలు ఏర్పడ్డాయి. అవే మరో కొత్త ద్రవిడ పార్టీకి బీజం వేశాయి. ఎంజీఆర్ సొంతంగా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం అనే పేరుతో 1972లో వేరు కుంపటి పెట్టుకున్నారు. మూడుసార్లు వరుసగా ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ట్రెండ్ మారిపోయింది. డీఎంకే, అన్నాడీఎంకేలలో ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంచుకునే సంప్రదాయం కొనసాగింది. ఒకసారి డీఎంకే అధికారంలోకి వస్తే మరోసారి అన్నాడీఎంకేను పవర్‌లోకి వచ్చే ట్రెడిషన్ నెలకొన్నది. 1987 తర్వాత ఫస్ట్ టైమ్ జయలలిత వరుసగా రెండోసారి (2016లో) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>