epaper
Wednesday, February 18, 2026
epaper

రాజేంద్రనగర్ లక్ష్మీగూడలో చదరపు గజం రూ.51 వేలు

కలం, హైదరాబాద్ : రాజేంద్రనగర్ (Rajendranagar) మండలంలోని లక్ష్మీగూడ (Laxmiguda) లోని హౌసింగ్ బోర్డు ఓపెన్ ప్లాట్ల విక్రయానికి మంచి స్పందన లభించింది. ఇక్కడి 14 ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి హౌసింగ్ బోర్డు (Housing Board) ఈ నెల 2వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా బుధవారం నిర్వహించిన వేలం పాటలో 49 మంది కొనుగోలుదారులు పాల్గొనగా..  ప్లాట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి.
ఈ భూముల చదరపు గజానికి రూ.32 వేలను అప్‌సెట్ ప్రైజ్‌గా (కనీస ధరగా) నిర్ధారించగా, వేలం పాటలో గరిష్టంగా చదరపు గజం రూ.51 వేలకు కొనుగోలు చేశారని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్  విపి గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ 14 ప్లాట్ల విక్రయాల ద్వారా హౌసింగ్ బోర్డుకు రూ.14.75 కోట్ల మేర ఆదాయం వచ్చిందని ఆయన వివరించారు. హోసింగ్ బోర్డు సౌత్ డివిజన్ ఎగ్జుక్యూటివ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించిన ఈ భూముల విక్రయాల్లో అతి తక్కువగా చదరపు గజానికి రూ.36 వేల ధర పలకగా, సగటున చదరపు గజం భూమి రూ. 44,285 ధర పలికింది.
వేలం ముఖ్యాంశాలు
• మొత్తం విక్రయించిన ప్లాట్లు 14
• అప్సెట్ ధర: చదరపు గజానికి ₹32,000
• అత్యధిక బిడ్: చదరపు గజానికి ₹51,000
• కనిష్ట బిడ్: చదరపు గజానికి ₹36,000
• సగటు బిడ్: చదరపు గజానికి ₹44,285
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>