కలం, మెదక్ బ్యూరో: రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యావ్యవస్థ నిర్వీర్యానికి దారితీసే జీవో 97ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని సిద్దిపేట (Siddipet) మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థినులు డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాన్ని నిరసిస్తూ బుధవారం నిరసనకు దిగారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ చట్టం పరిధిలో చేర్చడం వల్ల, నిరుపేద విద్యార్థులు పాలిటెక్నిక్ చదువులకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఎలాంటి ముందస్తు అభిప్రాయ సేకరణలు చేపట్టలేదని మండిపడ్డారు. స్పష్టమైన విధివిధానాలు బహిర్గతం చేయకపోవడంతో పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళనలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

