జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills Bypoll) పోరు హోరాహోరీగా సాగుతోంది. మూడు పార్టీల నుంచి అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచారు. ఈ ఉపఎన్నికలో ఈసారి స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు కూడా పెద్ద సంఖ్యలోనే వచ్చాయి. కాగా, జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నామినేషన్ వేయడానికి ఈరోజే ఆఖరు తేదీ. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. దీంతో ఎవరైనా నామినేషన్ వేయ దల్చుకుంటే మంగళవారం వేయాలని తెలిపారు. బుధవారం నుంచి అక్టోబర్ 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు అధికారులు. ఆ తర్వాత నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతోంది.
అయితే ఈ ఉపఎన్నికలో(Jubilee Hills Bypoll) గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో వ్యూహరచన చేస్తున్నాయి. ఇప్పటికే ప్రచారంలో తమ స్టైల్‌లో మూడు పార్టీలు దూసుకువెళ్తొన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పాగా వేయాలని కాంగ్రెస్, గెలిచి పరువు నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ సైతం ఈ నియోజకవర్గంలో గెలిచి తమ బలం పెంచుకోవాలని భావిస్తున్నాయి. ఇందుకోసమే ప్రచారంలో తమ కీలక నేతలను దించాయి. మరి ఈ హోరాహోరీ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
Read Also: ప్రకాష్ రాజ్ మరోసారి సంచలన పోస్ట్.. మళ్ళీ వాళ్లే టార్గెట్..

