విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) ఇటీవల కొన్ని పోస్ట్‌లు పెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, ప్రధాని మోదీలపై ఆయన చేస్తున్న ఘాటు వ్యాఖ్యలు పలు వివాదాలకు దారితీస్తున్నాయి. అంతేకాకుండా జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్‌తో ఆయన పెడుతున్న పోస్ట్‌లు సంచలనంగా మారుతున్నాయి. తాజాగా మరోసారి అటువంటి పోస్టే ఒకటి పెట్టారు. అందులో బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లను టార్గెట్ చేశారు. ‘‘మీరు మీ దేశాన్ని ప్రేమిస్తే.. మీ పిల్లలను ప్రేమిస్తే.. అమ్మాయిలను బీజేపీ నుంచి, అబ్బాయిలను ఆర్ఎస్ఎస్ నుంచి కాపాడండి’’ అంటూ ప్రకాష్ రాజ్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు ఇది కరెక్టే అంటూ రిప్లైలు ఇస్తుంటే మరికొందరు మాత్రం ప్రకాష్ రాజ్‌ను తప్పుబడుతున్నారు.
Read Also: విదేశీ విద్యార్థులకు అమెరికా గుడ్ న్యూస్..

