epaper
Sunday, February 22, 2026
epaper

పగలు బ్యూటీషియన్​.. రాత్రి లేడీ డాన్​

కలం, వెబ్​ డెస్క్​: పగలు సెలూన్​ నడుపుతూ, రాత్రి మాఫియా సామ్రాజ్యంలో లేడీ డాన్​గా పనిచేసే ఓ కిలాడీ ఉదంతమిది(Lady Don Neha). చేసిన తప్పులు ఆధారాలతో సహా బయటపడడంతో పోలీసులకు చిక్కి, ఊచలు లెక్కిస్తోంది. ఢిల్లీ పోలీస్​ స్పెషల్​ కౌంటర్​ ఇంటెలిజెన్స్​ విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. ఖుస్నుమ అన్సారీ అలియాస్​ నేహా ఢిల్లీలో ఓ సెలూన్​ నడుపుతోంది. అందులోనే బ్యూటీషియన్​గా పనిచేస్తోంది. అయితే, గ్యాంగ్​స్టర్​ లారెన్స్​ బిష్ణోయ్​పై దర్యాప్తులో భాగంగా ఇటీవల పోలీసులు కొంతమందిపై నిఘా పెట్టారు. అందులో బాబీ కబూతర్​(అసలు పేరు మహ్​పూజ్​) ఒకరు.

గన్​మెన్​ అయిన బాబీ.. బిష్ణోయ్​ గ్యాంగ్​కు ఆయుధాలు సరఫరా చేసేవాడు. అతను నేహా గ్యాంగ్​లో సభ్యుడని తేలింది. నేహా గురించి ఆరా తీయగా, సెలూన్​ నడుపుతున్నట్లు తెలుసుకొని పోలీసులు ఆశ్చర్యపోయారు. పగలు బ్యూటీషియన్​గా సెలూన్​ నడుపుతూ రాత్రిళ్లు మాఫియా సామ్రాజ్యంలో లేడీ డాన్​గా నేహా చెలామణీ అవుతున్నట్లు పోలీసులు కనుగొన్నారు. వెంటనే నిఘా పెట్టి ఆమెతోపాటు బాబీ, మరో ఇద్దరిని అరెస్ట్​ చేశారు.

కాగా, ఇటీవల కాలంలో మాఫియా గ్యాంగ్​ కార్యకలాపాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటీవలే అరెస్ట్ అయిన దీపా, జోయా ఖాన్ తర్వాత నేహా (Lady Don Neha) మూడో ‘లేడీ డాన్’ అని చెప్పారు.

ప్రజలకు నేహా బ్యూటీ పార్లర్​ నడుపుతున్నట్లు కనిపించినా, అది గ్యాంగ్​ అక్రమ కార్యకలాపాలకు ముసుగు మాత్రమేనని పోలీసులు తెలిపారు. నేహాను మేడమ్​ జహర్​గా అనుచరులు పిలుస్తున్నట్లు చెబుతున్నారు. వీళ్లను మహిపాల్​పూర్​ ఫ్లై ఓవర్​ సమీపంలో అరెస్ట్​ చేసినప్పుడు వాళ్ల దగ్గర నుంచి భారీ స్థాయిలో డ్రగ్స్​ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>