కెరీర్ కోసం రామ్ సరికొత్త ప్రయోగం.. హీరో మాత్రమే కాదు!

కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) తన తదుపరి చిత్రం కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత చిత్రాల పరాజయాల నేపథ్యంలో తన కెరీర్‌ను మళ్లీ గాడిలో పెట్టేందుకు భారీ బాధ్యతను భుజానికెత్తుకోబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. రామ్ తన తదుపరి చిత్రానికి నిర్మాణ బాధ్యతలను కూడా పర్యవేక్షించనున్నట్లు సమాచారం. ఓ విభిన్నమైన కథాంశాన్ని వెండితెరపైకి తీసుకురావడానికి ఆయన సిద్ధమవుతున్నారు.

ఈ ప్రాజెక్ట్ ద్వారా రామ్ కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా (Producer) వ్యవహరించనున్నారు. రచయితగా కూడా ఆయనే బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ చిత్రంలో ఆయనే ప్రధాన నటుడిగా ఉంటారు. సాధారణంగా స్టార్ హీరోలు తమ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడం అరుదు. కానీ రామ్ తన విజన్ మీద ఉన్న నమ్మకంతో ఈ సాహసం చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ తుది దశలో ఉందని, త్వరలోనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>