Mobile Popup Ad
Mobile Popup Ad

కుప్పంలో వైభవంగా గంగమ్మ జాతర

కలం, వెబ్ డెస్క్ : చిత్తూరు జిల్లా కుప్పంలో(Kuppam) గ్రామ దేవత శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర (Gangamma Jatara 2026) వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరలో భాగంగా శ్రీ ప్రసన్న ముత్తుమారెమ్మ అగ్నిగుండ ప్రవేశం అత్యంత ఘనంగా, భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారి శక్తిని, మహిమను స్మరించుకుంటూ జయజయధ్వానాలు చేశారు. అనంతరం కుప్పం పురవీధులలో అమ్మవారి శిరస్సును ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఊరేగింపు సందర్భంగా గ్రామం మొత్తం భక్తి వాతావరణంతో మారుమ్రోగింది. జాతరను చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చారు.

Read Also: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటలు!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>