కలం, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు, వారాంతపు రద్దీ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు (Tirumala Devotees) భారీగా పోటెత్తారు. దీంతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, వెలుపల కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
వేసవి సెలవుల దృష్ట్యా శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తుల భారీగా తరలివస్తున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న (సోమవారం) శ్రీవారిని 80,445 మంది భక్తులు దర్శించుకున్నారు. 43,309 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.41 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
Read Also: బోటు మనదే, వేట మనదే.. ఏపీ తీర ప్రాంతాలపై బాబు కీలక వ్యాఖ్యలు
Follow Us On: WhatsApp

