కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలను రద్దు చేయాలని చూస్తే.. అగ్గి పుట్టిస్తామని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. మహబూబ్ నగర్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డుమెంబర్లను కేటీఆర్ సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘మహబూబ్ నగర్ ను 5 జిల్లాలుగా చేసి కేసీఆర్ తప్పు చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతోంది. వనపర్తి, నారాయణ పేట, గద్వాల్ జిల్లాలను రద్దు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) చెబుతున్నారు. అలా చేస్తే ఇక్కడి ప్రజలు ఊరుకుంటారా.. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క జిల్లాను రద్దు చేసినా ఊరుకునేది లేదని’ హెచ్చరించారు కేటీఆర్.
కేసీఆర్ హయాంలో కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు ఏర్పాటు చేశారని.. కాంగ్రెస్ తీసేస్తామంటే ప్రజలు ఊరుకోరని కేటీఆర్ (KTR) చెప్పారు. ‘కొత్తగా ఎన్నికైన సర్పంచులకు పనులు చేయడానికి ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వట్లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. పట్టించుకునే దిక్కే లేదు. ఈ మహబూబ్ నగర్ కు ఏ విషయంలో అన్యాయం జరిగినా ఊరుకునేది లేదు. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవదు. కాంగ్రెస్ నేతలు అడ్డగోలు హామీలిచ్చి గెలిచారు. ఇప్పుడు హామీల గురించి ప్రశ్నిస్తే ప్రజలను డైవర్ట్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి మమ్మల్ని బూతులు తిడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ కు బలమైన సీట్లు ఇచ్చి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి’ అంటూ చెప్పుకొచ్చారు మాజీ మంత్రి కేటీఆర్.
Read Also: రేవంత్ రెడ్డి నీటి ద్రోహం బయటపడింది: హరీష్ రావు
Follow Us On: X(Twitter)


