కలం, వెబ్ డెస్క్ : కేంద్ర ఎన్నికల కమిషన్‌పై సుప్రీంకోర్టు స్వయంగా విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. బుధవారం ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు. ఎన్నికల కమిషన్‌పై తీవ్రమైన విశ్వసనీయత సమస్య ఉందన్నారు. ఎన్నికల కమిషన్ పై ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక వెలువరించిన నివేదిక నిజమని చాలా మంది భావిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి ఎన్నికల కమిషన్‌పై న్యాయపరమైన విచారణకు ఆదేశించాలని కేటీఆర్ కోరారు.

