కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోనే బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. వైద్య రంగంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. హైదరాబాద్‌లో పబ్లిక్ హెల్త్ సైన్సెస్ క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో మంది శాస్త్రవేత్తలను తయారు చేసి, దేశానికి అందించాయన్నారు. నెహ్రూ కాలం నుంచే సంస్కరణలు తీసుకురావడంతో దేశానికి పునాది వేశారని.. ఆ తరువాత ఎంతో మంది ప్రధానులు వాటిని కొనసాగించారన్నారు. పెట్టుబడిదారులు తెలంగాణకు క్యూ కడుతున్నారని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేవారికి మంచి లాభాలు ఉంటాయన్నారు. ప్రభుత్వ పరంగా తాను రక్షణగా ఉంటానన్నారు.
40 శాతం ఫార్మా ఎగుమతులు ఇక్కడి నుంచే..
ఫ్రాన్స్‌లో తయారు చేస్తున్న రాఫెల్ యుద్ధ విమానాలకు కూడా ఇక్కడి నుంచే పరికరాలు వెళ్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. 1965లోనే ఐడీపీఎల్ స్థాపించడంతో ఫార్మా రంగంలో అభివృద్ధి, పరిశోధనలు మొదలై.. ఫార్మా రంగంలో ప్రపంచంలోనే హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందన్నారు. 40 శాతం ఫార్మా ఎగుమతులు ఇక్కడి నుంచే ప్రపంచ దేశాలకు వెళ్తున్నాయని వివరించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరానికి రింగ్ రోడ్డు ఉందని, త్వరలోనే మరో పెద్ద రింగ్ రోడ్డు రాబోతుందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఐఎస్బీ, నల్సార్ వంటి విశ్వవిద్యాలయాలు ఎలా పేరు తెచ్చుకున్నాయో.. పబ్లిక్ హెల్త్ సైన్సెస్ క్యాంపస్ కూడా అలాగే పేరు తెచ్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2028 2047 నాటికి తెలంగాణ దేశంలో అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా ఉంటుందన్నారు.

