జమ్మికుంటలో పీఎం విశ్వకర్మ అవగాహన సదస్సు

కలం, కరీంనగర్: జమ్మికుంట (Jammikunta) పట్టణంలోని శంకర్ నందన గార్డెన్ లో బీజేపీ ఓబీసీ మోర్చా (BJP OBC Morcha) జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో పీఎం విశ్వకర్మ లబ్ధిదారులతో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. అదేవిధంగా స్థానిక శతరంజి చేనేత (నేతన్నల) కార్మికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఆ ప్రాంతంలో పర్యటించి వారితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్, జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డిలు హాజరై దిశా నిర్దేశం చేశారు.

ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అవగాహన

కేంద్ర ప్రభుత్వం సంప్రదాయ కుల వృత్తులవారి అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన ‘పీఎం విశ్వకర్మ’ పథకం ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం, ఆధునిక శిక్షణ, రాయితీ రుణాల వివరాలను లబ్ధిదారులకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

చేనేత కార్మికుల సమస్యల పరిశీలన

జమ్మికుంటలో ప్రసిద్ధి చెందిన శతరంజి చేనేత కార్మికుల (నేతన్నల) పని ప్రదేశాలను సందర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నేతన్నలు ఎదుర్కొంటున్న ముడి సరుకు కొరత, గిట్టుబాటు ధరల సమస్య మరియు జీవన ప్రమాణాల మెరుగుదలపై సుదీర్ఘంగా చర్చించారు. కార్మికులకు కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం అందేలా కృషి చేస్తామని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు, కరీంనగర్ జోనల్ ఇంచార్జ్ కందికట్ల సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి ఆడిచర్ల రాజు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు, మాజీ జిల్లా కొత్త చైర్మన్ కనుమల్ల విజయ- గణపతి, కౌన్సిలర్లు శీలం శ్రీనివాస్, తూర్పాటి చందన – శంకర్, గుర్రం కావ్య – పరశురాములు, సర్పంచ్ కేవిడ కుమార్ స్వామి, ఓబీసీ మోర్చా నాయకులు రాచకొండ కొమురయ్య, టంగుటూరి రాజ్ కుమార్, కడర్ల రతన్ కుమార్, గర్దాస్ సతీష్, సంపెల్లి సంపత్ రావు, ఇంగిలి ప్రభాకర్, నరాల రాజశేఖర్, కైలాసకోటి గణేష్, ఆడవాల శ్రీధర్, పొన్నగంటి రవికుమార్, దయ్యాల ప్రభాకర్, సిరియాల విజయ్, ఆకుల పోచయ్య, కడెం సతీష్, గుర్రం సంతోష్, నాగపురి విక్రం, కడిపికొండ వీరారెడ్డి, పొనగంటి సతీష్, ప్రధానమంత్రి విశ్వకర్మ లబ్ధిదారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ

భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్ సూచన మేరకు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కరీంనగర్ లోని వీరబ్రహ్మేంద్రస్వామి వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, రాష్ట్ర కార్యదర్శి ఓబీసీ మోర్చా రాజు అడిచెర్ల పాల్గొని వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాస్, పుప్పల రఘు, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాచకొండ కొమురయ్య, గర్దాస్ సతీష్, కడర్ల రతన్ కుమార్, రమేష్, రవి గోవింద్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>