కలం, కరీంనగర్: చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన కాదాసు మధురవ్వ ఇటీవలికాలంలో అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె కుమారుడు సీపీఐ ముదిమాణిక్యం గ్రామ శాఖ కార్యదర్శి కాదాసు మోహన్‌ను వారి కుటుంబ సభ్యులను సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి లతో కలిసి చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) పరామర్శించారు.
బుధవారం ముదిమాణిక్యంలో మధురవ్వ చిత్రపటానికి వెంకటరెడ్డి పూలమాలవేసి నివాళులర్పించి, మృతికి గల కారణాలను అడిగి తెలుసుకన్నారు. తల్లి మృతితో దుఃఖంలో ఉన్న వారి కుమారుడు మోహన్‌తో పాటు కుటుంబ సభ్యులకు వెంకటరెడ్డి ధైర్యం చెప్పారు. కాదాసు మధురవ్వ అకాల మరణం అత్యంత బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు తీరని లోటని, ఆమె లేని లోటు తీర్చలేనిదని, మధురవ్వ మరణం పట్ల సీపీఐ తరపున తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నట్లు, మోహన్ కుటుంబానికి అన్నివేళాలల సీపీఐ నాయకత్వం అండగా నిలుస్తుందని వెంకటరెడ్డి తెలిపారు.
మోహన్‌ను వారి కుటుంబ సభ్యుల పరామర్శించి, నివాళులర్పించిన వారిలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి,మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు అందె చిన్న స్వామి, తేరాల సత్యనారాయణ, మాజీ సర్పంచ్ లక్కిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, సీపీఐ నాయకులు కయ్యం తిరుపతి, లక్కిరెడ్డి సురేందర్ రెడ్డి, రాజు తదితరులు ఉన్నారు.

