కలం, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్చార్జ్గా బీఎం సందీప్ (BM Sandeep) నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ఏఐసీసీ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహించిన మీనాక్షి నటరాజన్ సేవలను, ఆమె అందించిన సహకారాన్ని అభినందించారు.
బీఎం సందీప్ కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ లీడర్. ఆయన ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల కాంగ్రెస్ ఇన్చార్జిగా పని చేశారు. అలాగే ఆర్జీపీఆర్ఎస్ జాతీయ, రాష్ట్ర కన్వీనర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయనకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోవడంలో ఆయన పాత్ర పోషించారు.

