కలం, సినిమా : సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) అభిమానులకు ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) క్షమాపణలు తెలిపారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా జరిగిన ఒక ట్వీట్ వివాదం నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమా మహేశ్ బాబు మూవీ రికార్డులను బద్దలు కొట్టాలని సూచించేలా ఒక పవన్ కల్యాణ్ అభిమాని ట్వీట్ చేయగా, దానికి దర్శకుడు హరీశ్ శంకర్ “తథాస్తు” అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో మహేశ్ బాబు అభిమానుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమైంది.
ఈ విషయంపై స్పందించిన హరీశ్ శంకర్ (Harish Shankar), ఆ ట్వీట్‌ను పూర్తిగా చదవకుండా రిప్లై ఇచ్చానని తెలిపారు. తనకు మహేశ్ బాబు అంటే ఎంతో ఇష్టమని, ఆయనపై ఎలాంటి అవమానకర కామెంట్స్ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటు వల్ల మహేశ్ బాబు అభిమానులు బాధపడి ఉంటే క్షమించాలంటూ హరీశ్ శంకర్ ఒక నోట్ విడుదల చేశారు. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Also: రక్షిత్ శెట్టితో నా కూతురుకు అందుకే బ్రేకప్ : రష్మిక తల్లి
Follow Us On: Youtube

