కలం, వెబ్ డెస్క్: ఎప్పుడు ప్రజాక్షేత్రంలోకి రావాలో కేసీఆర్కు బాగా తెలుసని.. సరైన సమయంలోనే బయటకు వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. అమిత్ షా, ఇంకో షా వచ్చినా.. తెలంగాణకు కేసీఆర్ బాద్ షా అని స్పష్టం చేశారు. ఢిల్లీకి డబ్బు సంచులు పంపించడంలో, ఓటుకు నోటు కేసులో దొరికిన బ్యాగుల విషయంలో, ఇచ్చిన హామీలు నెరవేర్చని విషయంలో రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి పదికి పది మార్కులు వేయొచ్చని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వ అవినీతిని వాళ్ల ఎమ్మెల్యేలే బయటపెడుతున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చేసిన రూ.4.5 లక్షల కోట్ల అప్పులతో ఒక్క మంచి పని చేశారా.. అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో కేవలం రూ.2.8 లక్షల కోట్ల అప్పులు మాత్రమే చేసి.. ఎన్నో గొప్ప పనులు చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రైజింగ్ (Telangana Rising) కాదు, అన్ని రంగాల్లో ఫాలింగ్ జరుగుతోందన్నారు.
ఒక్క పోరాటం చేయని బీజేపీ..
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీజేపీ నేతలు రక్షణకవచంలా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. అందుకే మూడేళ్లలో వారు ఒక్క ప్రజా పోరాటం కూడా చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఏంలా మారిందని అమిత్ షా చెబుతున్నారని.. మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులు జరిగి రెండేళ్లవుతున్నా.. ఇంతవరకు ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగితే ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఇంకో 500 ఏళ్ల తరువాత కూడా తెలంగాణ సాధించింది కేసీఆర్ అని భవిష్యత్తు తరాలు గొప్పగా చెప్పుకుంటాయని వివరించారు.
Also Read : పరువు తీస్తారా?.. రాహుల్ గాంధీపై కిషన్ రెడ్డి ఫైర్
Follow Us On : WhatsApp

