పరువు తీస్తారా?.. రాహుల్ గాంధీపై కిషన్ రెడ్డి ఫైర్

కలం, వెబ్ డెస్క్: విదేశాల్లో భారత్ పరువు తీయడమే రాహుల్ గాంధీ (Rahul Gandhi) పనిగా పెట్టుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఫైర్ అయ్యారు. వరుసగా 100 ఎన్నికల్లో ఓడిపోయినా.. బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. అమెరికా కొలంబియా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు. భారత ఆర్థిక వ్యవస్థ విధ్వంసమైపోయిందంటూ చెప్పడం దారుణమన్నారు. దేశ వ్యతిరేక కార్యక్రమాలను ప్రోత్సహించే వారితో రాహుల్ గాంధీ కుమ్మక్కయ్యారని ఆరోపించారు.

తుక్డే తుక్డే గ్యాంగులతో జతకట్టి.. దేశాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నట్లు కిషన్ రెడ్డి వివరించారు. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ వంటి ప్రపంచ ఆర్థిక సంస్థలు భారత ఆర్థిక వ్యవస్థ బాగుందని రిపోర్టులు ఇస్తున్న విషయం కనిపించడం లేదా.. అని ప్రశ్నించారు. ప్రపంచ వ్యాప్తంగా గందరగోళ పరిస్థితులున్నా.. భారత్ మాత్రం నిలకడగా ముందుకు వెళుతోందని చెప్పిన విషయం మర్చిపోయారా.. అని ఎద్దేవా చేశారు.

ఇండియా మాట వింటున్న ప్రపంచ దేశాలు..

రక్షణ, ఎలక్ట్రానిక్స్, ఆటో మొబైల్ రంగాల్లో మేకిన్ ఇండియా ద్వారా ఉత్పత్తులు పెరిగిన విషయం రాహుల్ గాంధీ తెలుసుకోవాలని కిషన్ రెడ్డి (Kishan Reddy) సూచించారు. ప్రపంచ ఐటీ రంగం దెబ్బతింటున్నా.. భారత్ మాత్రం పైపైకి వెళుతోందన్నారు. డేటా సెంటర్లకు భారత్ మాత్రమే ఏకైక డెస్టినేషన్‌గా మారిందన్నారు. భారత్ మరో శ్రీలంక, బంగ్లాదేశ్ అవుతుందంటూ రాహుల్ గాంధీ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడూ అప్పులు తీసుకునే దేశంగా భారత్‌ను మార్చేశాయని మండిపడ్డారు. మోదీ ప్రధాని అయ్యాకే పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ఇండియా ఏం చెప్పినా ప్రపంచ దేశాలు వినే పరిస్థితి ఉందన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ సత్తా మరోసారి ప్రపంచానికి తెలిసిందని స్పష్టం చేశారు.

Also Read : అజిత్ దోవల్‌కు సమన్లు.. భారత్ షాకింగ్ రిప్లై!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>