వితంతు పింఛన్‌కు రూ.10 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన కార్యదర్శి

కలం, కరీంనగర్ బ్యూరో : వితంతు పింఛన్‌ మంజూరు కోసం లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శిని (Panchayat Secretary) ఏసీబీ అధికారులు శనివారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కరీంనగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యదర్శిని ట్రాప్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 2022లో మృతి చెందాడు.

తన కోడలికి ‘తెలంగాణ చేయూత’ పథకం ద్వారా వితంతు పింఛన్‌ మంజూరు చేయించాలని కోరుతూ మృతుని తండ్రి స్థానిక పంచాయతీ కార్యదర్శి లావుడ్యా చవన్ లాల్‌ను కలిశాడు. పింఛన్‌ మంజూరు చేసేందుకు కార్యదర్శి రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. ​లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, శనివారం బాధితుడి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా కార్యదర్శి చవన్ లాల్‌ను పట్టుకున్నారు. ​అనంతరం ఫినాఫ్తలిన్ పరీక్ష నిర్వహించిన ఏసీబీ అధికారులు, కార్యదర్శిని అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>