ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు శిబిరాల్లో లోటుపాట్లు ఉండొద్దు : కలెక్టర్

కలం, నిర్మల్ రూరల్ : ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం శిబిరాల (Indiramma Family Life Insurance Camp) నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లకు ఆస్కారం ఉండకూడదని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్మల్ రూరల్ మండలం చిట్యాల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు శిబిరాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన బీమా నమోదు తీరును పరిశీలించారు. బీమా నమోదు ప్రక్రియ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

బీమా చేయు వ్యక్తి పేరు, నామినీ వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలని అన్నారు. వివరాల నమోదులో ఎలాంటి తప్పులు చేయకూడదన్నారు. ప్రక్రియ పూర్తి చేసిన వారి వివరాలు రిజిస్టర్ లో స్పష్టంగా పొందుపరిచాలని చెప్పారు. బీమా (Indiramma Insurance) నమోదు ప్రక్రియలో ఏవైనా సాంకేతికపరమైన ఇబ్బందులు కలిగితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. శిబిరాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ తనిఖీలో తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీఓ సుధాకర్, సర్పంచ్ సుప్రియ వెంకట్ రెడ్డి, తదితరులున్నారు.

Also Read : “అధికార అహంకారంతో మాట్లాడొద్దు”.. సీఎం కు రాజగోపాల్ రెడ్డి కౌంటర్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>