epaper
Thursday, March 5, 2026
epaper

మూసీ సుందరీకరణకు మేం వ్యతిరేకం కాదు : కేటీఆర్

కలం, వెబ్ డెస్క్ : మూసీ సుందరీకరణకు బీఆర్ ఎస్ వ్యతిరేకం కాదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. నాగోల్ లోని ఎస్టీపీని బీఆర్ ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలాగా మూసీని కాంగ్రెస్ కు అప్పగించాం. గతంలో కిలోమీటర్ల పొడవున మూసీ నదిని ఒక్క ఇళ్లు కూడా కూల్చకుండా రూ.6 కోట్లతో అభివృద్ధి చేశాం. క్రీడా ప్రాంగణాలు, ఓపెన్ జిమ్ లు, ల్యాండ్ స్కేపింగ్ లాంటివి నిర్మించాం. సుందరీకరణ అంటే కూల్చకుండా కూడా అభివృద్ధి చేయొచ్చని మేం చూపించాం. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం సుందరీకరణ పేరుతో ఇండ్లను కూల్చుతోంది’ అంటూ ఆరోపించారు కేటీఆర్.

మూసీ వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా 55 కిలోమీటర్ల దాకా ఎక్కడా నీళ్లు చుక్క కూడా ఆగకుండా ప్రవహిస్తుంది. ఈ 55 కి.మీ. దాకా 84 మీటర్లు కిందకు ఉంటుంది. నీళ్లు ఆగకుండా వెళ్తున్నాయని.. 15 బ్రిడ్జిలు బీఆర్ ఎస్ హయాంలో మంజూరు చేశాం. వాటి కిందనే రోడ్ కమ్ చెక్ డ్యామ్ మంజూరు చేశాం. వీటి కోసం రూ.545 కోట్లు కేటాయించాం. వీటి సాయంతో నీళ్లు నిల్వ ఉంచేలా ఏర్పాటు చేశాం. అప్పుడు బోటింగ్, టూరిస్ట్ స్పాట్ గా డెవలప్ చేయొచ్చని.. అవన్నీ ప్లాన్ చేశాం. కానీ ఇన్ని చేసినా రేవంత్ ప్రభుత్వం వాటిని గాలికొదిలేసింది. ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేస్తే మూసీలోకి శుద్ధమైన నీళ్లు వస్తాయి. ఆ ఒక్క పని చేయకుండా రేవంత్ ప్రభుత్వం ఇండ్లను కూల్చుతోంది. ప్రభుత్వం ఇలా కూల్చుకుంటూ వెళ్తే బీఆర్ ఎస్ చూస్తూ ఊరుకోదు. ప్రజలే కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారు’ అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!