భ‌ట్టి కొడుకు పెళ్లిలో కేటీఆర్‌.. ఆత్మీయంగా ప‌ల‌క‌రించిన కాంగ్రెస్ నేత‌లు

క‌లం, వెబ్ డెస్క్‌: డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka) కొడుకు విక్ర‌మాదిత్య పెళ్లి వేడుక‌లు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. ఈ వేడుకులకు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఈ వివాహానికి హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్‌ను కాంగ్రెస్ నేత‌లు ఆత్మీయంగా ప‌ల‌క‌రించారు. భ‌ట్టి విక్ర‌మార్క‌, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కేటీఆర్‌తో స‌ర‌దాగా ముచ్చ‌టించారు. ఇటీవ‌ల కోమ‌టిరెడ్డి ఫ్యామిలీలో ఓ వివాహానికి బీఆర్ఎస్ నేత హ‌రీశ్ రావు హాజ‌రైన‌ప్పుడు కూడా ఇలాంటి ప‌రిస్థితులే క‌నిపించాయి. రాజ‌గోపాల్ రెడ్డితో హ‌రీశ్ రావు ప్ర‌త్యేకంగా కూర్చొని చ‌ర్చ‌లు జ‌రుపుతున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. రాజ‌కీయాల ప‌రంగా ఎన్ని వైరుధ్యాలున్నా శుభ‌కార్యాల్లో ఇలా న‌వ్వుతూ మాట్లాడుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>