కలం, వెబ్ డెస్క్ : స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పుపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అసెంబ్లీ సాక్షిగా నిలువునా ఖూనీ చేసిందని విమర్శించారు. సుప్రీంకోర్టు మీద, రాజ్యాంగం మీద రాహుల్ గాంధీకి ఏ మాత్రం గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ‘బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్లినప్పటి నుంచి ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అపహాస్యం చేస్తోంది. అభివృద్ధి కోసమే పార్టీ మారామని ఫిరాయింపు ఎమ్మెల్యేలే మీడియా సాక్షిగా చెప్పినా సరే వాళ్లను కాపాడారు. ఇది రాహుల్ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరిగితే సరిపోదు. దాన్ని గౌరవించాలి. తండ్రి చేసిన చట్టాన్ని గౌరవించలేని నాయకుడిగా రాహుల్ చరిత్రలో నిలిచిపోతారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.
రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలన వైఫల్యాలపై పంచాయతీ ఎన్నికల్లో ఎదురవుతున్న వ్యతిరేకతకు ఎన్నికలు అంటేనే కాంగ్రెస్ జంకుతోంది. అందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోడానికి వెనకడుగు వేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇప్పుడు కాపాడినా.. ప్రజాక్షేత్రంలో వారిని అనర్హులుగా ప్రజలు ఎప్పుడో ప్రకటించారు’ అంటూ మాజీ మంత్రి కేటీఆర్(KTR) ట్వీట్ చేశారు.
Read Also: బంగ్లాలో భారత హై కమిషన్‌పై దాడికి యత్నం
Follow Us On: Instagram


