కలం, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ (The Rajasaab) నుంచి ఫుల్ మెలోడీ సాంగ్ వచ్చేసింది. మారుతి డైరెక్ట్ చేస్తున్న ది రాజాసాబ్ (The Rajasaab) జనవరి 9న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్లలో భాగంగా రీసెంట్ గా సహనా సాంగ్ ప్రోమో రిలీజ్ చేయగా.. తాజాగా ఫుల్ మెలోడీ సాంగ్ వదిలారు. ఇందులో ప్రభాస్, నిధి అగర్వాల్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ ఇలాంటి ఫ్రెష్ లుక్ లో కనిపించేసరికి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. నిధి అగర్వాల్ గ్లామర్ సాంగ్ కు స్పెషల్ అట్రాక్షన్ గా మారిందని కామెంట్లు పెడుతున్నారు. అందమైన లొకేషన్లలో సాంగ్ షూట్ చేసినట్టు కనిపిస్తోంది.
Read Also: అమెరికాకంటే ఇండియా డబుల్.. AI వాడకంలో మనమే టాప్!
Follow Us On: Sharechat


