మీనాక్షిని రేవంత్ వెన్నుపోటు పొడిచాడు: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వెన్నుపోటు పొడిచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ అవినీతిపై రాహుల్ గాంధీకి మీనాక్షి నటరాజన్ నివేదిక ఇచ్చారని.. అందుకే మీనాక్షిపై రేవంత్ పగబట్టారని అన్నారు. మీనాక్షిపై దొంగకేసులు పెట్టించి బీజేపీ పార్టీకి లీకులు ఇచ్చారని ఆరోపించారు. మీనాక్షి నటరాజన్ కు రాజ్యసభ పదవి రాకుండా రేవంత్ రెడ్డి అడ్డుకున్నాడని చెప్పారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆదివారం ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.

రేవంత్ ఫస్టాఫ్ సినిమా డిజాస్టర్..

రేవంత్ రెడ్డి ఫస్టాఫ్ సినిమా డిజాస్టర్ అని కేటీఆర్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ లో కొత్త ఇల్లు కట్టలేదని.. కొత్త ఇటుక పెట్టలేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన ఇళ్లకేకాంగ్రెస్ వాళ్లు సున్నం వేసి ఇస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడుతూ మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటివరకు 4 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని, అలాగే నిరుద్యోగ భృతి రూ. 4 వేల హామీని కూడా గాలికొదిలేశారని మండిపడ్డారు. కేటీఆర్, కేసీఆర్ ఉద్యోగాలు ఊడగొట్టారని ఆరోపించిన రేవంత్, ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు. మహిళా హామీపై స్పందిస్తూ, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి, అది నెరవేరితే నిరూపించాలని, లేని పక్షంలో తాను రాజీనామాకు సిద్ధమని కేటీఆర్ (KTR) సవాల్ విసిరారు.

Read Also: ముంచుకొస్తున్న ఎల్‌నినో ముప్పు.. మహాసముద్రంలో డేంజర్ బెల్స్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>