Mobile Popup Ad
Mobile Popup Ad

వర్షాకాలంలో పాదాల ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టే చిట్కాలు

కలం, వెబ్‌డెస్క్: సాధారణంగా చర్మ సంరక్షణ అనగానే చాలామంది ముఖం, చేతులపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. కానీ, శరీరంలోనే అత్యంత ముఖ్యమైన పాదాల సంరక్షణను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ పాదాల శుభ్రత విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు. పాదాల సంరక్షణ కోసం (Foot Care) కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు నిపుణులు.

వర్షాకాలంలో బయట నుంచి తిరిగి రాగానే.. ప్రత్యేకించి నడిచి వచ్చే సందర్భాలలో పాదాలను లిక్విడ్ వాష్, సబ్బు ఉపయోగించి గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పాదాలను బాగా పొడిగా తుడుచుకొని వేళ్ల మధ్యలో యాంటీ ఫంగల్ పౌడర్ చల్లుకోవాలట. కొంత మంది కాలిగోళ్లను చాలా పెద్దగా పెరిగే వరకు కత్తిరించుకోరు. దీని వలన గోళ్లలో మురికి చేరి దురద, ఇతర చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే కాలి గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవడం ముఖ్యమని సూచిస్తున్నారు.

స్క్రబ్ తప్పనిసరి..

కొంత మందికి పాదాల పగుళ్లు ఎక్కువగా వస్తుంటాయి. అయితే పాదాలను రోజూ స్క్రబ్ చేసుకోవడం వలన పాదాలు పగలకుండా ఉంటాయని చెబుతున్నారు. ఇందుకోసం గోరువెచ్చని నీటిలో కొద్దిగా షాంపూ లేదా లిక్విడ్ సోప్ కలుపుకోవాలి. ఈ లిక్విడ్‌లో పాదాలను పది నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత ఫుట్ స్క్రబ్‌లో శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు.

అలాగే రోజూ ప్యుమిస్ స్టోన్ ని ఉపయోగించి పాదాలను శుభ్రం చేసుకుని ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలట. దీనివల్ల మృతకణాలు తొలగిపోవడమే కాకుండా పాదాలకు రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది. సౌందర్య నిపుణుల సూచనల ప్రకారం.. ఏవి పడితే అవి వాడకుండా ఎల్లప్పుడూ నాణ్యమైన ఉత్పత్తులను మాత్రమే ఎంచుకోవడం సురక్షితం.

గాయాల పాదాలపై ప్రత్యేక శ్రద్ధ

పాదాలకు గాయాలు ఉన్నట్లయితే వాటి ద్వారా బ్యాక్టీరియా, రోగాలను కలిగించే ఇతర క్రిములు శరీరంలోకి సులభంగా ప్రవేశిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లపై ఉండే మురికి నీటి వల్ల ఈ ఇన్ఫెక్షన్ల బెడద మరీ ఎక్కువ. అందుకే పాదాలకు గాయాలవకుండా జాగ్రత్తపడాలి (Foot Care). ఒకవేళ ఇప్పటికే చిన్న చిన్న పగుళ్లు లేదా గాయాలు ఉన్నట్లయితే, నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read Also: అమ్మ నుంచి ఫోన్ కాల్.. ప్రెస్‌మీట్‌కు నితీశ్‌ బ్రేక్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>