కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్ .. కేటీఆర్ ఫైర్

కలం, వరంగల్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ కరోనా కంటే డేంజర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)  తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. హనుమకొండలో బుధవారం నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాహుల్ గాంధీ గల్లీలో ఉండే తొట్టి గ్యాంగ్ తో వరంగల్ లో రైతు డిక్లరేషన్ పేరిట చేసిన నయవంచనకు నాలుగేళ్లు నిండిందని విమర్శించారు. రైతు డిక్లరేషన్ లో పేర్కొన్న 34 హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. రైతు డిక్లరేషన్ బోగస్ పత్రమని, చిత్తు కాగితం ఇచ్చి గద్దెనెక్కారని దుయ్యబట్టారు.

నాడు ఓట్ల కోసం డిల్లీ నుంచి వచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడు రైతులు గోస పడుతుంటే ఎక్కడ సచ్చాడని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి గాడిద పండ్లు తోముతున్నాడా అని ప్రశ్నించారు. రైతుల కళ్లలో రక్తం కారుతుంటే అన్నం తినే కంచంలో మన్ను పొయ్యొచ్చా అన్నారు. ఇంకా కాంగ్రెస్ నాయకులు సిగ్గు శరం లేకుండా మెగా రైతుమేళా నిర్వహిస్తున్నారని, అది మెగా రైతుమేళా కాదని దగా రైతు మేళాని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చెడ్డీ గ్యాంగ్ కంటే ప్రమాదకరమని, వీళ్ల ఫోటోలు తీసి పోలీస్, రైల్వే, బస్ స్టేషన్లలో పెట్టి కింద దొంగలున్నారు జాగ్రత్త అని రాసి పెట్టాలని సూచించారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన హయాంలో రైతు బంధు పథకం కింద 11 సార్లు 73 వేల కోట్లు రైతు ఖాతాల్లో వేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్న రైతులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబందు డబ్బులు ఆపడానికి ఏమైనా ”నీ అయ్యా సొమ్మా? నీ అబ్బా సొమ్మా?” అని దుయ్య బట్టారు. రైతు బంధు ఆపినా రేవంత్ రెడ్డి హౌలా.. దివానా, ధోఖే బాజ్ అంటూ తిట్ల దండకం చదివారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>