కలం, వెబ్ డెస్క్: తమిళగ వెట్రి కళగం అధినేత (TVK Chief) విజయ్ లోక్‌భవన్ వేదికగా సరికొత్త రాజకీయ సంచలనానికి తెరలేపారు. గవర్నర్‌ను స్వయంగా కలిసిన ఆయన రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా తనకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేల పూర్తి వివరాలతోపాటు 20 మంది సభ్యులతో కూడిన మంత్రుల తుది జాబితాను గవర్నర్‌కు అందజేశారు. ఈ కీలక భేటీ ముగించుకుని విజయ్ లోక్‌భవన్ నుంచి వెనుదిరిగారు. రేపే ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు, ప్రమాణస్వీకార మహోత్సవానికి లోక్‌భవన్ నుంచి ఏ క్షణంలోనైనా అధికారిక పిలుపు వచ్చే అవకాశం ఉంది.

