సూర్యకుమార్ ఫామ్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు.. ‘ప్లాన్ బి’ ఉండాల్సిందే!

కలం, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026 (IPL 2026) లో అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తున్న బ్యాటర్ల టాప్ లిస్ట్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ (Suryakumar Yadav) పేరు కచ్ఛితంగా కనిపిస్తుంది. ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో కూడా తన సత్తా చాటుకోలేకపోయాడు సూర్యకుమార్. వరుసగా విఫలమవుతున్న సూర్యపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత టీ20 కెప్టెన్‌గా ఉన్న ఆయన, ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి కేవలం 195 పరుగులు మాత్రమే చేశారు. స్ట్రైక్ రేట్ కూడా 150 లోపే ఉండటం గమనార్హం. ముంబై జట్టు 9 మ్యాచ్‌లలో కేవలం 3 మ్యాచ్‌లు గెలిచి పట్టికలో అట్టడుగున ఉండటంతో, సూర్య ఫామ్‌పై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif) కీలక వ్యాఖ్యలు చేశారు.

సూర్యకుమార్ తన పాత బ్యాటింగ్ పద్ధతిని మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని కైఫ్ అభిప్రాయపడ్డారు. సాధారణంగా సూర్య ఆడే 360 డిగ్రీల షాట్లనే ఇప్పుడు ప్రత్యర్థి బౌలర్లు అతడిని అవుట్ చేయడానికి ఆయుధాలుగా వాడుకుంటున్నారని చెప్పారు. సూర్య ఫేమస్ షాట్లు ఆడే క్రమంలోనే ఇప్పుడు ఎక్కువగా క్యాచ్ అవుట్ అవుతున్నారని కైఫ్ గుర్తుచేశారు. అందుకే నెట్స్‌లోకి వెళ్లి తన టెక్నిక్‌ను సరిచేసుకోవాలని, బ్యాటింగ్‌లో ‘ప్లాన్ బి’ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. బౌలర్లు ఇప్పుడు సూర్యను ఎలా ట్రాప్ చేయాలో పూర్తిగా అవగాహన పెంచుకున్నారని కైఫ్ విశ్లేషించారు. లెగ్ సైడ్ షాట్లపైనే ఆధారపడకుండా కవర్స్, మిడ్ ఆఫ్ దిశగా షాట్లు ఆడటం అలవాటు చేసుకోవాలని కోరారు. ముంబై ఇండియన్స్ గెలుపులో ఎప్పుడూ కీలక పాత్ర పోషించే సూర్య, ఈ ఏడాది ఇలా వెనుకబడిపోవడం జట్టుకు పెద్ద లోటు అని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>