ఆరు గ్యారంటీలపై BRS ఒత్తిడి.. అసెంబ్లీలో కీలక బిల్లులు

కలం వెబ్ డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల (Six Guarantees) హామీలను అమలు చేయడంలో విఫలమైందని, వీటిని అమలుచేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తాము అసెంబ్లీ వేదికగా ప్రైవేట్ మెంబర్ బిల్లులు ప్రవేశపెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)  తేల్చి చెప్పారు. మంగళవారం జరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వర్క్ షాప్‌‌నకు ఆయన హాజరై మాట్లాడారు. అధికారం కోసం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించిందన్నారు.

ముఖ్యంగా కోటి 67 లక్షల మంది మహిళలకు నెలకు రూ.2500, వృద్ధులు, వితంతువులు, నేతన్నలకు రూ.4 వేల పెన్షన్, అలాగే దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇచ్చేలా చట్టబద్ధత కల్పించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఈ హామీలను నెరవేర్చేలా ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంలోనే కాకుండా, శాసనసభలో కూడా పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. తాము ప్రవేశపెట్టే ప్రైవేట్ మెంబర్ బిల్లులకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇవ్వాల్సిందేనని, కాంగ్రెస్ నేతలు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కేటీఆర్ (KTR) సవాల్ విసిరారు.

Read Also: ఇండిగో సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా..

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>