కలం, వెబ్ డెస్క్ : విమాన రంగంలో ప్రముఖ సంస్థ అయిన ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo Airlines) సీఈఓగా పనిచేస్తున్న పీటర్ ఎల్బర్స్(Pieter Elbers) వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నారని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఆయన రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని ఇండిగో సంస్థ వెల్లడించింది. పీటర్ ఎల్బర్స్ 2022 నుండి ఇండిగో సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన రాజీనామా తర్వాత సీఈఓగా ఎండీ రాహుల్ భాటియా (Rahul Bhatia) తాత్కాలిక బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇండిగో సంస్థ త్వరలో కొత్త సీఈఓని నియమించనుంది.

