అవినీతిపై ప్రశ్నిస్తే.. బెదిరింపులకు పాల్పడుతున్న సీఎం రేవంత్: KTR

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో తన స్కాములు, అవినీతి గురించి ప్రశ్నిస్తే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) బెదిరింపులకు పాల్పడుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్‌లో శనివారం నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్వీ సమావేశంలో (BRSV meeting) ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ అక్రమాలను ప్రశ్నించిన సందర్భంలో కూడా ప్రతిపక్షాన్ని బెదిరించే ధోరణి ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి బెదిరింపులు అలవాటైపోయాయని, అలాంటి బెదిరింపులకు బీఆర్‌ఎస్ ఎప్పటికీ భయపడదని స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్ట్ పేరుతో జరుగుతున్న అవినీతి పై కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ఒక్క రూపాయి లేదని చెప్పే సీఎం, తన అవినీతి సొమ్ముల కోసం మూసీ పేరిట రూ.లక్షన్నర కోట్లను ఖర్చు చేస్తానని ప్రకటించడం దారుణమని మండిపడ్డారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.16 వేల కోట్లతో రూపొందించిన సమగ్ర ప్రణాళికను పక్కన పెట్టి, భారీ అంచనాలతో అవినీతి కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం మూసీ నదిలో మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేసిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని మూసీలోకి పంపించే ప్రణాళిక కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. అయినా ప్రస్తుత ప్రభుత్వం అంచనాలను అనవసరంగా పెంచి అవినీతికి మార్గం సుగమం చేస్తోందని విమర్శించారు. మూసీ ప్రాజెక్ట్ పేరుతో లక్షలాది ఇళ్లను కూల్చివేయడానికి, దాదాపు 3000 ఎకరాల భూమిని సేకరించి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఒకవైపు మూసీ ఒడ్డున ఉన్న ఇళ్లు చట్ట విరుద్ధమని చెప్పే ప్రభుత్వం, అదే ప్రాంతంలో భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్లు నిర్మించాలనుకోవడం ద్వంద్వ వైఖరి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>