Mobile Popup Ad
Mobile Popup Ad

పోలీసు వాహనం ఢీ కొని ASI మృతి

కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి (Sangareddy) జిల్లా మనూర్ పోలీస్ స్టేషన్ ఎదుట ASI గోవింద్ నాయక్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. సోమవారం అర్ధరాత్రి గోవింద్ నాయక్ పైకి పోలీస్ వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి కారణం అయిన డ్రైవర్ హోమ్ గార్డ్ పరారీలో ఉన్నాడు. దీంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. పాత గొడవలను దృష్టిలో పెట్టుకుని కావాలనే గోవిందరావుపైకి వాహనం ఎక్కించాడని ఏఎస్ఐ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక కుట్ర కోణం దాగి ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంపై సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న పోలీసులు హోమ్ గార్డ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read Also: స్లీపర్ బస్సు.. జర్నీ టు హెల్

Follow Us on: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>