Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ సత్తెమ్మ పాడె మోసిన కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని అగ్రహారానికి చెందిన ప్రముఖ ఉద్యమకారురాలు తెలంగాణ సత్తెమ్మ (Telangana Satthemma) మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించి, అంత్యక్రియల్లో పాల్గోని పాడె మోశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ చురుకైన పాత్ర పోషించారని.. ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ ‘జై తెలంగాణ’ నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత సత్తెమ్మ అని కేటీఆర్ కొనియాడారు. స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన జిందం సత్తెమ్మ అలియాస్ తెలంగాణ సత్తెమ్మ (65) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందింది. కరీంనగర్‌లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు సత్తెమ్మ వీరాభిమాని. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న సత్తెమ్మ.. 2009 నుంచి కేటీఆర్‌ మద్దుతుగా ఆయన వెంట నిలిచేది. సత్తెమ్మ గ్రామం మాధ్యమనేరులో ముపునకు గురవడంతో రగుడులో డబుల్ బెడ్ రూం ఇచ్చి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచారు. సత్తెమ్మ కొడుకు మృతితో మనోవేదనతో ఆమె అనారోగ్యం బారిన పడి కరీంనగర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>