కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) గురువారం జగిత్యాలలోని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి (Jeevan Reddy) నివాసానికి చేరుకున్నారు. అనంతరం ఆయనతో భేటీ అయ్యారు. జగిత్యాలకు చేరుకున్న కేటీఆర్‌కు ఆయనకు బీఆర్ఎస్ శ్రేణులు, జీవన్ రెడ్డి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జీవన్ రెడ్డి త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్న విషయం తెలిసిందే. కేసీఆర్ సమక్షంలో భారీ బహిరంగసభలో ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కేటీఆర్ జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. తన నివాసానికి చేరుకున్న కేటీఆర్‌ను జీవన్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరతాను: జీవన్ రెడ్డి
తాను బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నానని జీవన్ రెడ్డి (Jeevan Reddy) ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని.. ప్రజలు రేవంత్ పాలనకంటే కేసీఆర్ పాలనే బాగుందని అనుకుంటున్నారని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆ పార్టీపై జీవన్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రజలకిచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ నేతల నుంచి సైతం అదేస్థాయిలో కౌంటర్లు వస్తున్నాయి.
Read Also: వైఎస్సార్‌తో కొట్లాడి ఉదయ సముద్రం ప్రాజెక్టు తెచ్చాం: రాజగోపాల్ రెడ్డి
Follow Us On: Instagram

