కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో (Hyderabad Traffic Rules) ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేస్తూ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ (Helmet) లేకుండా ద్విచక్ర వాహనం నడిపే వాహనదారులపై కేవలం జరిమానాతోనే సరిపెట్టడం లేదు. డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నెలల పాటు రద్దు చేయనున్నారు. నగరంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి, ప్రాణనష్టాన్ని తగ్గించడానికి ఈ చర్యలు చేపట్టారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల గాయాలై మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో ఈ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించారు.
హెల్మెట్ లేని ప్రయాణంతోపాటు రాంగ్ రూట్‌లో వాహనాలు నడపడం, అతివేగం, సిగ్నల్ జంపింగ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడితే కూడా లైసెన్స్ సస్పెన్షన్ తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించనివారి వివరాలను ఆర్టీఏ (RTA) అధికారులకు పంపనున్నారు. లైసెన్స్‌లను తాత్కాలికంగా రద్దు చేయిస్తారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ ప్రాణాలను కాపాడాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Also: జనాభా లెక్కలు.. ఎన్నో ప్రశ్నలు
Follow Us On : WhatsApp

