Mobile Popup Ad
Mobile Popup Ad

క్యాతనపల్లిలో నీచమైన రాజకీయాన్ని చూశాం: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: భారత దేశంలో పంజాబ్, హర్యానాను తలదన్ని వరి ఉత్పత్తిలో నంబర్. 1 రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. మంచిర్యాల జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు బీజేపీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. “కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని అంటున్న సన్నాసులను నేను అడుగుతున్నా.. 2014కు ముందు తెలంగాణలో పండిన పంట ఎంత? 2021-22లో పండిన పంట ఎంత?” అని ప్రశ్నించారు. బిడ్డ పుట్టాలంటే తొమ్మిది నెలలు సమయం పడుతుంది అని రేవంత్ రెడ్డి అంటున్నాడని.. ప్రభుత్వం ఏర్పాటు చేసి 30 నెలలు అయితుంది, ఇంకా బిడ్డ పుట్టకపోతే నీకు ఏం పేరు పెట్టాలి, ఏమని పిలవాలి? అంటూ ఘాటుగా ప్రశ్నంచారు.

తెలంగాణలో ఆనాడు 24 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి కేసీఆర్ వచ్చాక ఒక కోటి 50 లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట పండిన విషయం వాస్తవం కాదా? అని విమర్శించారు. క్యాతనపల్లిలో నీచమైన రాజకీయాన్ని చూశామన్నారు. పోలీసుల రాజ్యంతో మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో తెలంగాణకు ఎలాంటి లాభం చేకూరలేదని కేటీఆర్ (KTR) విమర్శించారు.

Read Also: తెలుగులో ఆశా భోస్లే పాడిన ఈ పాట చాలా ఫేమస్ తెలుసా?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>