మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హౌజ్ అరెస్ట్

కలం, నిజామాబాద్ బ్యూరో : మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy)ని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. నిజామాబాద్ ఇటు బాల్కొండ నియోజక వర్గంలో బీఆర్ఎస్ నాయకులను ఎక్కడి కక్కడ ముందస్తు అరెస్ట్ చేశారు. నిజామాబాడ్ జిల్లా భీంగల్ పట్టణ అభివృద్ధిలో నిలిచిపోయిన 100 పడకల ఆసుపత్రి, మార్కెట్, బస్ డిపో, సీఎస్ రోడ్ల పూర్తి వంటి పెండింగ్ అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఈరోజు భీం గల్ పట్టణంలో నిరాహార దీక్ష తలపెట్టారు. ఉదయం 10 గంటలకు దీక్ష ప్రారంభం కానుంది. సాయంత్రం 5 వరకూ దీక్ష కొనసాగించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ పోలీసులు వేల్పూరు లోని ఇంట్లో ప్రశాంత్ రెడ్డి ని హౌజ్ అరెస్ట్ చేశారు.. అరెస్టులను ప్రశాంత్ రెడ్డి ఖండించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>