దిలావర్‌పూర్‌లో అర్ధరాత్రి దొంగల బీభత్సం.. రెండు ఇళ్లలో చోరీ!

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌(Dilawarpur )లో మండల కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడి మొత్తం రూ.80 వేల నగదు, తులం బంగారాన్ని అపహరించారు. గౌరీ చిన్న పోశెట్టి ఇంట్లో రూ.50 వేల నగదు, తులం బంగారం చోరీ చేయగా, పల్దె ముత్యం ఇంట్లో రూ.30 వేల నగదు దొంగిలించారు. బాధితుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న ఎస్సై రవీందర్ వివరాలు సేకరించారు. ముగ్గురు దొంగలు ఈ చోరీలకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>