యాంకర్ విష్ణుప్రియకు షాక్​.. కేసు నమోదు

కలం, వెబ్​ డెస్క్​ : ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ భీమినేని (Vishnu Priya) చిక్కుల్లో పడ్డారు. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేస్తున్న కంటెంట్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విష్ణుప్రియ అసభ్యకరమైన, అర్ధనగ్న ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ యువతను పెడదారి పట్టిస్తున్నారని పేర్కొంటూ ఏఐఎస్ఎఫ్ (AISF) నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేవలం ఫొటోలు పోస్ట్ చేయడమే కాకుండా, ఎక్స్‌పోజింగ్ వీడియోల కోసం సబ్‌స్క్రిప్షన్ పేరుతో ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేయడం నేరమని ఫిర్యాదుదారులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. విష్ణుప్రియ (Vishnu Priya) ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని, తక్షణమే ఆమె అకౌంట్‌ను బ్లాక్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ నేతల ఫిర్యాదును స్వీకరించిన విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు, నిబంధనల ప్రకారం విష్ణుప్రియపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.​

Read Also: క్యాతనపల్లిలో నీచమైన రాజకీయాన్ని చూశాం: కేటీఆర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>