కలం, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా అభిమానుల్ని స్వంతం చేసుకున్న లెజెండర్ సింగర్ ఆశా భోస్లే (Asha Bhosle).. 20 భాషల్లో సుమారు 12 వేలకు పైగా పాటలు పాడారు. 1943లో ప్రారంభమైన ఆమె ప్రస్థానం సుమారు అరవయ్యేళ్ళ పాటు సాగింది. సినిమా సంగీతం, పాప్ సంగీతం, గజల్స్, భజన పాటలతోపాటు భారత సాంప్రదాయ సంగీతం, జానపదాలు, ఖవ్వాలీ పాటలను సైతం ఆమె పాడారు. ఈ కాలంలో ఆమె వెయ్యికి పై చిలుకు హిందీ సినిమాల్లో పాటలు పాడింది. తెలుగు సినిమాల్లోనూ ఆమె అనేక పాటలు పాడారు. 1988లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చిన్నికృష్ణుడు సినిమాలోని జీవితం సప్తసాగర గీతం’ అనే ఆర్డీ బర్మన్ కంపొజిషన్ తో వచ్చిన పాట ఇప్పటికీ శ్రోతల్ని ఆకట్టుకుంది.
తెలుగులో లెజెండరీ సింగర్ ఆశా భోస్లే.. చందమామ సినిమాలోని “నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు” అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2007లో విడుదలైన ఈ సినిమాకు కె.ఎం. రాధాకృష్ణన్ సంగీతం అందించగా, అనంత శ్రీరామ్ పాటను రచించారు. కాజల్ అగర్వాల్, నవదీప్ నటీనటులుగా మెప్పించారు. మోడ్రన్ థీమ్‌తో క్లాసికల్ టచ్‌తో సాగే ఈ సాంగ్ అప్పట్లో చాలా ఫేమస్. అలాగే ఆశా భోస్లే ఆధ్యాత్మిక కీర్తనలు సైతం ఆలపించారు. “లాలనుచు నూచేరు లలనలిరుగడల.. బాలగండవీర గోపాల బాల” అనే కీర్తనను ఆలపించి శ్రోతల మనస్సులో తనదైన ముద్రను వేసుకున్నారు.
ఆశా భోస్లే (Asha Bhosle) ఏడు ఫిలింఫేర్ అవార్డులతో పాటు రంగీలా సినిమాకు స్పెషల్ అవార్డు, లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్, రెండు జాతీయ ఉత్తమ నేపధ్య గాయని అవార్డులు, IIFA అవార్డులతో పాటు పలు అవార్డులను గెలుచుకుంది.
ఆశా భోస్లే అందుకున్న ఇతర పురస్కారాలు:
1987: నైటింగేల్ ఆఫ్ ఆసియా అవార్డు (ఇండో-పాక్ అసోసియేషన్, యూకె)
1989: లతా మంగేష్కర్ అవార్డు (మధ్యప్రదేశ్ ప్రభుత్వం)
1997: స్క్రీన్ వీడియోకాన్ అవార్డు (జానం సమాజ కరో ఆల్బమ్)
1997: ఎమ్టీవి అవార్డు (జానం సమాజ్ కరో ఆల్బమ్)
1997: ఛానల్ వి అవార్డు (జానం సమ్ఝా కరో ఆల్బమ్
1998: దయావతి మోడీ అవార్డు.
1999: లతా మంగేష్కర్ అవార్డు (మహారాష్ట్ర ప్రభుత్వం)
2000: సింగర్ ఆఫ్ ది మిలీనియం (దుబాయ్)
2000: జీ గోల్డ్ బాలీవుడ్ అవార్డు (తక్షక్ నుండి ముఝే రంగ్ దే)
2001: ఎమ్టీవి అవార్డు (కంబక్త్ ఇష్క్)
2002: బిబిసి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు (యూకె ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ చేత సమర్పించబడింది)
2002: ఉత్తమ నేపథ్య గాయనిగా జీ సినీ అవార్డు-మహిళ (లగాన్ నుండి రాధా కైసే నా జాలే)
2002: హాల్ ఆఫ్ ఫేమ్ జీ సినీ స్పెషల్ అవార్డు.
2002: సాన్సుయి మూవీ అవార్డు (లగాన్ నుండి రాధా కైసే నా జాలే)
2003: భారతీయ సంగీతానికి చేసిన కృషికి స్వరాలయ యేసుదాస్ అవార్డు
2004: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లివింగ్ లెజెండ్ అవార్డు
2005: ఎమ్టీవి ఇమ్మీస్, ఉత్తమ మహిళా పాప్ యాక్ట్ ఆజ్ జానే కీ జిద్ నా కరో
2005: సంగీతంలో అత్యంత స్టైలిష్ వ్యక్తి
Read Also: నో కాంప్రమైజ్.. ఇదే జెన్ జీ ఫార్ములా!!
Follow Us On: X(Twitter)

